ఇది పాటల వేళయనీ

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే!
నిర్వహణ - నాగ సాయి రమ్య  

 చిత్రం - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే!
సంగీతం - యువన్ శంకర్ రాజా 
దర్శకత్వం - సెల్వరాఘవన్  



నా మనసుకు ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి ఓఓ..(2)
నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముగ్గే పరిచి
ఉన్నావు లోకం మరిచి(నా మనసుకి)

నీ చూపుకి చంద్రుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి
మొదలయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి
నా మనసనే ఒక సరస్సులో
అలజడులే సృష్టించావే.. (నా మసుకి)

ఒక మాట ప్రేమగా పలకలే
ఒక అడుగు జతపడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో
ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే
ఎద పైన నిదురే పోవాలె
తీయ తీయని నీ స్మృతులతో
బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలి నీ ఆర్ద్రత గుర్తించాలి
ఎటు తేలక బదులీయక
మౌనంగా చూస్తుండాలి

*****

ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం

చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే (ఏమైంది)

ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా
తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే ఉరకలేసా

*****

అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా….గుండెల్లో కొలువుండగా..
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా.. (అల్లంత)

కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమనిపించగా
దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా……….

తన వయ్యరంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో వోమ్పుల్తో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక
టిల్ పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా……. (అల్లంత)

*****

మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా….
స్వప్నం చెదిరిందమ్మా. సత్యం ఎదురుందమ్మా
పొద్దే లేని నిద్దర్లోనే నిత్యం వుంటావా
ప్రేమ ప్రేమ నీ పరిచయం పాపం అంటే కాదనలేవా…(2)

ప్రేమాలయంలా వుంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మ
చెంతకొస్తే మంటేలే అందదని నిందించొద్దమ్మా
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమ ప్రేమ నీ స్నేహమే తీయని శాపం మన్నిస్తావా….

ఒక చినుకునైన దాచాడు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్నీ తానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకిపై పంపించి చల్లగ దీవించవే నేడు
జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చావా కన్నీళ్లు
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు
ప్రేమ ప్రేమ మదిలో భారం కరిగించేలా ఓదార్చవా…….

*****

చెలి చెణుకు కనులు వల వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగా జతగా
పసి నడుమే నయగారా అడుగేసే నను చేరా… (చెలి)

సింహమల్లె పొగరు వుంది నన్ను గిచ్చి చంపుతుంది
చెక్కిలి నొక్క చేరర పక్క
వన్నె చిన్నె వున్న కన్నె లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా నీ పరువం మడతడిపోవునే
అంత మగసిరి నీలోన వున్నది కదా మరి రావా
చప్పునొచ్చెయ్ వచ్చి వాటెయ్ చురకలే వేసీ
అంతగా త్వరపడలేనులే నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కథకళి ఆటలే హే పడుకో చలిగిలి పాటలే ( చెణుకు)

Come my baby……..

హేయి రూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు
మగువల జన్మ అరె ఏందిరా బ్రహ్మ
హో అవును అంటే కాదు అనిలే కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీపైన అల్లరి పెరిగెను లోన
దాచలేక చెప్పలేక ఏమిటో తడబాటు
గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగా ఊహలు
చెప్పకు పొడి పొడి మాటలే అనుకున్నది అందితే హాయిలే…..

*****

No comments:

Post a Comment